ATM బిజినెస్...నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదన

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 12:47 PM

ATM బిజినెస్...నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదన

బ్యాంక్ ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకొని.. దాని ద్వారా ప్రతి నెలా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు డబ్బులు పొందొచ్చు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఏటీఎం ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు నేరుగా ఏటీఎంలను ఏర్పాటు చేయవు. పలు కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని, వాటి ద్వారా ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి. ఏటీఎం ఏర్పాటు చేయాలంటే.. ముందుగా స్థలం కావాలి. 50 నుంచి 80 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. ఇతర ఏటీఎంలకు 100 మీటర్ల దూరం ఉండాలి. 24 గంటల పవర్ సప్లై చాలా అవసరం. 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవసరం అవుతుంది. ఏటీఎం ద్వారా రోజుకు 300 ట్రాన్సాక్షన్లు జరిగే స్థలాన్ని ఎంచుకోవడం ఉత్తమం. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, ఫోటోగ్రాఫ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. బ్యాంకులు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి. అందువల్ల మీరు టాటా ఇండీక్యాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం వంటి కంపెనీల వెబ్‌సైట్లకు వెళ్లి ఏటీఎం ఫ్రాంచైజీ కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు రూ.2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్, రూ.3 లక్షల ఏటీఎం క్యాష్ పెట్టుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.

Tata Indicash - www.indicash.co.in
Muthoot ATM - www.muthootatm.com/suggest-atm.html
India One ATM - india1atm.in/rent-your-space





Untitled Document
Advertisements