హీరోగా కౌశల్ ఎంట్రీ...'పీపుల్ స్టార్' అంటూ పోస్ట్

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 12:57 PM

హీరోగా కౌశల్ ఎంట్రీ...'పీపుల్ స్టార్' అంటూ పోస్ట్

బిగ్ బాస్ షోతో కౌశల్ మంద ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అంతకు ముందు బుల్లితెర, అడల్ట్ చిత్రాలు, వెండితెర అంటూ అక్కడక్కడా తిరిగేవారు. అయితే తాజాగా తాను హీరోగా రాబోతోన్న ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైందంటూ కౌశల్ ప్రకటించారు. ఈ క్రమంలో తనని తాను పీపుల్ స్టార్ అని చెప్పేసుకున్నారు. ‘గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ నన్ను "పీపుల్ స్టార్" గా పిలుచుకుంటూ ఆనందిస్తూ, అన్నా నిన్ను బిగ్ స్క్రీన్ మీద హీరో గా చూడాలను వుంది ఆ అవకాశం మాకు ఎప్పుడు వస్తుంది అంటూ ప్రతీ రోజు అడుగుతూ వారి కోరిక తీర్చటమే నా కలగా మార్చిన నా అభిమానులందరి కోసం ఈ రోజు మీ అందరి రోజు గా చేస్తూ నేను హీరో గా నటిస్తున్న "రైట్" మూవీ ముహూర్తం షాట్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎప్పటి లాగే మీ ప్రేమ , అభిమానం నా మీద , మా మూవీ యూనిట్ మొత్తం మీద చూపిస్తారని నాకు తెలుసు’ అని అన్నారు. ఇక అలా పీపుల్ స్టార్ అని చెప్పుకోవడంపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. ఆర్ నారాయణ మూర్తి పీపుల్ స్టార్ అని తెలుసు మరీ నువ్ కూడానా? అని సెటైర్లు వేస్తున్నారు. ఇలా ఇష్టమొచ్చినట్టు స్టార్ ట్యాగ్‌లు తగిలించుకుంటున్నారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.





Untitled Document
Advertisements