బిట్ కాయిన్‌లో డబ్బులు పెడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్!!

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 06:54 PM

బిట్ కాయిన్‌లో డబ్బులు పెడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్!!

మీరు క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెడుతున్నారా? లేదంటే డబ్బులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బిట్ కాయిన్, ఇథీరియమ్, డోజికాయిన్, రిప్పిల్, బైనాన్స్ వంటి పలు రకాల క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టే వారిపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసి ఉంచింది.

క్రిప్టోకరెన్సీల్లో డబ్బులు పెట్టిన వారి వివరాలు ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలను కోరినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌ వివరాలు అన్నింటికీ అందించాలని కోరిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్ల మీరు క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టాలని భావిస్తే.. ఒకసారి ఆలోచించండి.

క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసి కొంత మంది అధిక రాబడి పొందుతున్నారని, కానీ ఆ రాబడిని ఆదాయం కింద చూపించడం లేదని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీల నుంచి వివరాలు కోరుతోంది. అందువల్ల క్రిప్టోలో డబ్బులు పెట్టే వారు ఈ విషయాన్ని గమనించాలి.

కాగా దేశంలో క్రిప్టో కరెన్సీకి చట్టబద్దత లేదు. క్రిప్టోలో డబ్బులు పెట్టవద్దన ఆర్‌బీఐ గతంలో నిషేధం విధించింది. అయితే సుప్రీం కోర్టు తర్వాత ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పటి నుంచి మన దేశంలో కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతూ వస్తున్నాయి.





Untitled Document
Advertisements