కొత్త బైక్ కొనాలా? రూ.1600 ఈఎంఐ!

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 06:55 PM

కొత్త బైక్ కొనాలా? రూ.1600 ఈఎంఐ!

మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకు టీవీఎస్ కంపెనీకి చెందిన రేడియన్ బైక్ అందుబాటులో ఉంది. మీ బడ్జెట్ రూ.70 వేల నుంచి రూ.80 వేలు ఉన్నా సరిపోతుంది. ఈ బైక్ మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది.

టీవీఎస్ రేడియన్ బైక్‌ను మీరు రూ.7 వేల డౌన్‌ పేమెంట్‌తో కొనుగోలు చేశారని అనుకుందాం. ఈ టూవీలర్ ఢిల్లీ ఆన్‌రోడ్ ధర దాదాపు రూ.72 వేలు. అంటే మీరు ఇంకా రూ.65 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేటు 9.7 శాతం అని అనుకుందాం.

మీరు లోన్ టెన్యూర్ ఎంచుకునే విధానం ప్రకారం మీ ఈఎంఐ మారుతుంది. మీరు 36 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2372 చెల్లించాలి. అదే మీరు ఇంకా ఈఎంఐ తగ్గించుకోవాలని భావిస్తే.. ఎక్కువ టెన్యూర్ ఎంచుకోవాలి. 60 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ.1600 ఈఎంఐ పడుతుంది.





Untitled Document
Advertisements