'ఖిలాడి' షూట్ రీస్టార్ట్

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 11:42 AM

'ఖిలాడి' షూట్ రీస్టార్ట్

రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయినట్టుగా ఇటీవల వార్తలు షికారు చేశాయి. ప్లానింగ్ లోపం వలన తన డేట్స్ వేస్ట్ అవుతున్నాయనే అసహనాన్ని రవితేజ వ్యక్తం చేసినట్టుగా చెప్పుకున్నారు. అలాంటి ప్రచారానికి తెరదించేస్తూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 26వ తేదీ నుంచి మొదలుకానుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను, దసరా బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.





Untitled Document
Advertisements