'ఇష్క్'... వీడియో సాంగ్ రిలీజ్

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 01:30 PM

'ఇష్క్'... వీడియో సాంగ్ రిలీజ్

తేజ సజ్జ - ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా 'ఇష్క్ .. నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎన్వీ ప్రసాద్ .. పారస్ జైన్ .. వాకాడ అంజన్ కుమార్ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్ ను వదిలారు. 'ఆనందం మదికే ..' అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. బ్యూటిఫుల్ విజువల్స్ పై కట్ చేసిన ఈ పాట చాలా బాగుంది.







Untitled Document
Advertisements