గాలవుడికి ఆ పేరెలా వచ్చింది?

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 03:32 PM

గాలవుడికి ఆ పేరెలా వచ్చింది?

ఇతడు విశ్వామిత్రుని కుమారుడు. గాలవుడు బ్రహ్మవాది. మాంధాత వంశంలో అరుణుడనే రాజు వుండేవాడు. అతనికుమారుడు సత్యవ్రతుడు. ఇతడు బ్రాహ్మణుని వివాహ మండపంలోకి వెళ్లి పెళ్లి కూతుర్ని ఎత్తుకొని వస్తాడు. అది సహించలేని రాజు ఇతన్ని దేశ బహిష్కరణ చేస్తాడు. అందువల్ల దేశంలో కరువు కాటకాలు వస్తాయి. విశ్యామిత్రుని భార్య పిల్లలు ఆకలి బాధతాళలేక వీధిన పడతారు. విశ్వామిత్రుని భార్య అందరూ ఆకలితో చనిపోవడం కంటే ఒకర్ని అమ్మి ఇతరుల్ని బ్రతికించాలని తలచి గాలవుడి మెడ చుట్టూ దర్భలు చుట్టి వీధిలోకి తీసుకెళ్ళి అమ్మాలని ప్రయత్నించగా సత్యవ్రతుడు వీరిని ఆదుకుంటాడు. గాలవుడు తప్పించుకుంటాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది.





Untitled Document
Advertisements