ఘృతాచి ఎవరు? ఈమె వలన సంతానం పొందిన మునులు ఎవరు?

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 04:12 PM

ఘృతాచి ఎవరు? ఈమె వలన సంతానం పొందిన మునులు ఎవరు?

ఈమె అతిగొప్ప సుందరాంగి అయిన అప్సరస. ఈమె తన అందంతో ఎంతోమంది ఋషుల తపస్సు భగ్నం చేసి వారి వల్ల సంతానం పొందింది.
* వ్యాసుడు సంతానం కోరి మహామేరు పర్వతం మీద ఘోరతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఒక కుమారుడు జన్మిస్తాడని ఆశీర్వదిస్తాడు. తన కుటీరానికి వచ్చి అగ్ని పుట్టించడానికి అరుణ రుద్దుతూ వివాహమే కాని తనకు పిల్లలెలా జన్మిస్తారని ఆలోచనలో పడగా ఘృతాచి మేఘాల నుండి ఇతని ముందు నిలబడి అతడి తీక్షణ దృష్టికి భయపడి చిలుకలా మారి ఎగిరి పోయింది. వ్యాసునికి ఆ సుందరిని చూసి రేతఃపతనమై ఆ కట్టెలపై పడి ఆ కట్టెలను రుద్డగా అందుండి ఓ శిశువు జన్మిస్తాడు. అతడే తర్వాత కాలంలో గొప్పముని అయిన శకుడు .
* గంగాతీరంలో భరద్వాజ మహర్షి స్నానం చేస్తుండగా ఘృతాచి అక్కడే స్నానం చేసింది. ఆమె సౌందర్యానికి భరద్వాజునికి వీర్యస్కలనం కాగా అది ఓ(ద్రోణం) అనగా కుండలో భద్రపరచగా అందులో పాండవుల గురువైనా ద్రోణాచార్యుడు జన్మించాడు. మరో మారు ఈమె వల్ల భరద్వాజునికి శృతావతీ జన్మించింది.
* ప్రమతి అనే రాజు వల్ల ఈమె కురురుడికి జన్మనిచ్చింది.
* ఘృతాచి వలన విశ్వకర్మకు చిత్రాంగదుడు జన్మించాడు.
*ఈమెకు దేవవతి అనే కుమార్తె కూడా జన్మించింది.





Untitled Document
Advertisements