హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 ఎడిషన్ లాంచ్...సరికొత్త ఫీచర్లు

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 04:19 PM

హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 ఎడిషన్ లాంచ్...సరికొత్త ఫీచర్లు

తాజాగా హీరో సంస్థ సరికొత్త మ్యాస్ట్రో ఎడ్జ్ 125 ఎడిషన్ ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 72,250లుగా సంస్థ నిర్దేశించింది. మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ లభ్యమవుతుంది. బుకింగ్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో ప్రారంభమయ్యాయి. హీరో ఇండియా అధికారిక వెబ్ సైట్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు.

ఈ సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 మూడు వేరియంట్లోల దొరుకుతుంది. డ్రమ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.72,250లు కాగా.. డిస్క్ వేరియంట్ ధర రూ.76,500లుగా నిర్దేశించింది. కనెక్టెడ్ వేరియంట్ వచ్చేసి రూ. రూ.79,750లుగా నిర్ణయించింది. అంతేకాకుండా ఈ స్కూటర్ ప్రిస్మాటిక్ యెల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ రంగుల్లో సొంతం చేసుకోవచ్చు.

డిస్క్ వేరియంట్ అయితే క్యాండీ బ్లేజింగ్ రెడ్, ఫ్యాంథర్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్, మ్యాట్ టెక్నో బ్లూ, ప్రిస్మాటిక్ యేల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ రంగుల్లో లభ్యమవుతుంది. డ్రమ్ వేరియంటైతే క్యాండీ బ్లేజింగ్ రెడ్, ప్యాంథర్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్, మ్యాట్ టెక్నో బ్లూ రంగుల్లో సొంతం చేసుకోవచ్చు.
2021 హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125

డిజైన్..
ఈ స్కూటర్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ తో పాటు సరికొత్త డ్యూయల్ ప్రాజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు ఉన్నాయి. ఇవి కాకుండా ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్లు, షార్పర్ ఫ్రంట్ డిజైన్, స్పోర్టీ డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్, మాస్కెడ్ వింకర్లు లాంటి అప్డేట్లు చేశారు.
ఫీచర్లు, టెక్నాలజీ
టర్న్ బై టర్న్ నేవిగేషన్
మిస్డ్ కాల్ అండ్ ఇంకమింగ్ కాల్ అలెర్ట్
రియల్ టైం మైలేజ్ ఇండికేషన్(ఆర్టీఎంఐ)
ఎకో ఇండికేటర్
లో ఫ్యూయల్ ఇండికేటర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా
లైవ్ వెహికల్ ట్రాకింగ్
డ్రైవింగ్ స్కోర్
జియో ఫెన్సింగ్ అలెర్ట్
హీరో లోకేట్
స్పీడ్ అలెర్ట్
టాపుల్ అలెర్ట్
టూ వే అలెర్ట్
వెహికల్ స్టార్ట్ అలెర్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

​లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ లాంచ్.. ఈ కారు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

ఇంజిన్..
ఈ సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ఇది 124.6సీసీ పీజీఎం-ఫై ఇంజిన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా ఎక్స్ సెన్స్ టెక్నాలజీతో పాటు వచ్చింది. అంతేకాకుండా ఇది 7000 ఆర్పీఎం వద్ద 9 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 10.4 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా సస్పెన్షన్, బ్రేక్స్, వీల్స్ తో పాటు టైర్లు అదే ఓల్డ్ మోడల్ తో పాటు వచ్చింది. 125సీసీ స్కూటర్లలో బ్లూటూత్ ఆప్షన్ తో వచ్చిన మొదటి బైక్ మ్యాస్ట్రో ఎడ్జ్ గుర్తింపు తెచ్చుకుంది.





Untitled Document
Advertisements