తంబురుడి శాపవిమోచనం!

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 04:55 PM

తంబురుడి శాపవిమోచనం!

ఇతను ఓ దేవా గంధర్వుడు. గంధర్వుల్లో గొప్ప సంగీత విద్వాంసుడు. తుంబురుడు బ్రహ్మదేవుని మనుమడు. ఇతడు కశ్యపుని నలుగురు గాంధర్వ కుమారులైన తుంబురు, బాహు, హాహా, హుహు అందరూ చక్కటి సంభాషణా కళాప్రవీణులే. తుంబురుని వీణ పేరు "కళావతి". తుంబురుడు పాండవుల యెడ మిక్కిలి అభిమానము కలవాడు. ఇతడు అర్జునుని జన్మోత్సవంలో పాల్గోన్నాడు. మరొకసారి ధర్మరాజుకు 100 గుర్రాలు బహుకరించాడు. అర్జునుడు దేవలోకం వచ్చినప్పుడు స్వాగతం పలికాడు. విరాటుని కొలువులో వుండగా గోగ్రహణ సమయంలో కౌరవులకు అర్జునుడికి జరిగిన యుద్దాన్ని తిలకించాడు. ధర్మరాజు అశ్వమేధ యాగానికి వచ్చాడు. తుంబురుడు కుబేరుని కొలువులో వున్ననాడు రంభను ప్రేమించి తనను కొలుచుట లేదని రాక్షసుడిగా జన్మించమని కుబేరుడు శపించాడు. శాపవిమోచనానికి వేడుకోగా శ్రీరాముని బాణానికి హతుడవై నిజరూపం దాల్చగలవని చెప్తాడు. ఇతడు విరాధుడను రాక్షసుడిగా జన్మించి రామలక్ష్మణుల అరణ్యవాస సమయమున వీరి పైకి రాగా శ్రీరాముని బాణానికి హతుడై గంధర్వ రూపం దాల్చి కుబేరుని చేరతాడు.





Untitled Document
Advertisements