వింత...నదిలో నుంచి పైకొచ్చిన భూమి : వీడియో

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 08:15 PM

వింత...నదిలో నుంచి పైకొచ్చిన భూమి : వీడియో

హర్యానాలో అకస్మాత్తుగా ఓ సరస్సు నుంచి నేల బయటకు పైకి ఉబ్బింది. నీటి అడుగు నుంచి పైకొచ్చిన మట్టితో అక్కడ చిన్న సైజు దీవి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరస్సు అడుగున ఉన్న నేల ఒక చోట నుంచి నెమ్మదిగా పైకి రావడం మొదలైంది. దీంతో అటుగా వెళ్తున్నవారు దాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత నేల.. హాలీవుడ్ తరహాలో పైకి లేచింది. పెద్ద మొత్తంలో మట్టి ఒక్కసారిగా నీటి నుంచి బయటకు వచ్చి బుల్లి సైజు మట్టి దిబ్బలా ఏర్పడింది.
అయితే.. సరస్సు నుంచి నేల పైకి ఎందుకు లేచిందనేది తెలియరాలేదు. ఈ ఘటన జరగడానికి ముందు అక్కడ భారీ వర్షం కురిసినట్లు స్థానికులు తెలిపారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో సుమారు 6.1 మిలియన్ మంది వీక్షించారు. సుమారు 61 వేల మంది లైక్ చేశారు. హాలీవుడ్ సినిమా తరహాలో ఉన్న ఈ ఘటన వీడియో చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. నీటి అడుగున్న పెద్ద ఎత్తున మీథేన్ వాయువు విడుదల కావడం వల్ల తడి నేల బుడగలా పైకి ఉబ్బి ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి జరుగుతున్నప్పుడు అక్కడ ఉండకపోవడమే ఉత్తమం అని, వీడియోలు తీయడం మానేసి దూరంగా వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. ఆ అరుదైన వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.







Untitled Document
Advertisements