ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన బజాజ్

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 11:54 AM

ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన బజాజ్

2021లో చాలా స్టాక్స్ అదిరిపోయే రాబడిని అందించాయి. ఇక్కడ ఒక షేరు అయితే ఏకంగా 350 రెట్లు రాబడిని అందించింది. ఈ ఏడాది మల్టీ బ్యాగర్స్‌లో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ చాలానే ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో ఒకటని చెప్పుకోవాలి. 12 ఏళ్ల కిందట బజాజ్ ఫైనాన్స్ షేరు ధర రూ.17 వద్ద ఉండేది. 2021లో ఈ షేరు ధర రూ.6,177 స్థాయికి పరుగులు పెట్టింది. అంటే షేరు ధర 350 రెట్లు పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ షేరు 2002లో స్టా్క్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. అప్పుడు షేరు ధర కేవలం రూ.5. 2008 నాటికి షేరు ధర రూ.45కు చేరింది. తర్వాత ఇక షేరు ధర పరుగులు పెడుతూ వచ్చింది. ఇన్వెస్టర్ల పంట పడించిందని చెప్పుకోవచ్చు. కోటీశ్వరులను చేసింది. ఆరు నెలల కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ.1.25 లక్షలు వచ్చేవి. అదే ఏడాది కింద రూ.లక్ష పెట్టి ఉంటే.. చేతికి రూ.1.95 లక్షలు లభించేవి. అదే 12 ఏళ్ల కింద మీరు ఈ షేరులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. రూ.లక్షకు రూ.3.5 కోట్లు లభించేవి.





Untitled Document
Advertisements