'శ్యామ్ సింగ రాయ్' షూటింగు పూర్తి

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 12:02 PM

'శ్యామ్ సింగ రాయ్' షూటింగు పూర్తి

నాని ఈ ఏడాది ఎంచుకున్న కథలు చాలా విభిన్నమైనవి. వాటిలో 'శ్యామ్ సింగ రాయ్' ఒకటి. ఈ కథ .. కథనం చాలా డిఫరెంట్ గా ఉండనున్నాయి. టైటిల్ .. నాని లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తున్నాయి. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కథా నేపథ్యం కారణంగా ఈ సినిమాను ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చిత్రీకరించారు. సెట్ లో షూటింగు కావడం వల్లనే, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోను, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగు కానిచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయగలిగారు. నిన్నటితో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుందనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి నటించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కనిపించనుంది. కీలకమైన పాత్రను జిషు సేన్ గుప్తా పోషించాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపే అవకాశాలు కనిస్తున్నాయి. 'టక్ జగదీష్'ను విడుదలకు రెడీ చేసి .. 'శ్యామ్ సింగ రాయ్'ను పూర్తిచేసిన నాని, 'అంటే .. సుందరానికీ' ప్రాజెక్టుపై పూర్తి దృష్టిపెట్టనున్నాడు.





Untitled Document
Advertisements