దివోదాసు పాలించిన వారణాసి నశించునట్లు శపించిందేవరు?

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 01:29 PM

దివోదాసు పాలించిన వారణాసి నశించునట్లు శపించిందేవరు?

దివోదాసు ఇతడ్ని అతిధగ్యుడు అని కుడా అంటారు. ఇతడు సుదేవుడను కాశీరాజు పుత్రుడు. విష్ణువు అంశతో జన్మించిన వంశంలోని వాడు. దివోదాసు ముత్తాత తండ్రి కాశుడు. వారణాశిని వీరే పాలించిరి కనుక కాశీ రాజ్యమని పేరువచ్చింది. దివోదాసు రాజ్యపాలన చేస్తూ క్షేమకుడను రాక్షసుడ్ని వధించి రాజ్యాన్ని విస్తృతపరిచాడు. భద్రశ్రేణ్యుడను రాజు దివోదాసు పై దండెత్తగా అతని 100 మంది పుత్రుల్ని జయించాడు. ఆ సమయంలో కుంభకుడను ముని వారణాసి వచ్చాడు. సాయంత్రానికి ఎక్కడికి చేరితే అక్కడే ఉండిపోవడం అతని ఆచారం. అలా కుంభకుడు వారణాసిలో 100 సంవత్సరాలు ఉండిపోయాడు. ఆ సమయంలో వారణాసిలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. కుంభకుడి ఆశ్రమం చుట్టూ మాత్రం పచ్చటి పొలాలు పంటలు పండుతున్నాయి. వారణాసి ప్రజలు వారి ఆవుల్ని కూడా అక్కడ మేపుకుని వెళ్ళేవారు. ఒక రోజు వారి పశువులతో పాటు కుంభకుడు పూజించే గోవుని కూడా తోలుకేల్లారు. కుంభకుడు తన దివ్య దృష్టితో అంతా గ్రహించి వారణాసి నశించునట్లు శపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.





Untitled Document
Advertisements