దీర్ఘతముడు పుట్టుగుడ్డిగా జన్మించుటకు కారణమేమి?

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 01:48 PM

దీర్ఘతముడు పుట్టుగుడ్డిగా జన్మించుటకు కారణమేమి?

బ్రహ్మ పుత్రుడైన అంగిరసుడికి ఇద్దరూ కుమారులు. ఒకరు ఉతథ్యుడు రెండు వాడు బృహస్పతి. ఉతథ్యుడు ఇంట్లో లేని సమయంలో బృహస్పతి ఉతథ్యుని భార్య మమతను కామిస్తాడు. ఆమె నిరాకరించగా అతడు వినకుండా బలాత్కరించబోగా మమత గర్భంలోని శిశువు బృహస్పతిని తన్నగా కడుపులోని బిడ్డను పుట్టు గుడ్డిగా జన్మించమని శపిస్తాడు. ఈ పుట్టిన బిడ్డే దీర్ఘతముడు. ఇతడు బృహస్పతి అంతటి శక్తివంతుడు. ప్రద్వేషిణి అనే బ్రాహ్మణిని వివాహమాడగా ఇతనికి చాలామంది పిల్లలు జన్మించారు. అందులో ముఖ్యుడు గౌతముడు. ఆ తర్వాత ఇతడు తప్పుడు పనులు చేయడం వల్ల ఇతని భార్య తన పిల్లలతో సహాయంతో ఓ చిన్న పడవలో ఎక్కించి నదిలోకి తోసేసింది. ఆ నదిలో పడవపై వేదాలు పఠిస్తూ వెళ్తున్న దీర్ఘతముడ్ని గుర్తించి బలి అనే రాజు ఒడ్డుకు చేర్చి తనకు పుత్రబిక్ష పెట్టమని తన భార్య సుధేష్ణను అతని వద్దకు పంపగా ఆమె తాను తప్పుకొని సేవికను పంపుతుంది. అతనివల్ల ఆమెకు కాక్షి వాణుడు మరి పది మంది పండితులు జన్మించారు. రాజు మరల రాణి సుధేష్ణను అతని వద్దకు పంపగా అతడామెను స్పృశించి ఆశీర్వదించగా 5 గురు ప్రజ్ఞావంతులైన పుత్రులు జన్మిస్తారు. వారు అంగ, వంగ, కళింగ, పుండ్ర, శృంగులు వారు రాజ్యాలను స్థాపించారు. అవి వారి పేర్లతో ప్రసిద్ది చెందాయి.





Untitled Document
Advertisements