తెలంగాణలో భూకంపం

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 02:44 PM

తెలంగాణలో భూకంపం

తెలంగాణలో భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించింది. హైదరాబాద్‌ సమీపంలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయింది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది.

అయితే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చినట్లు గుర్తించారు. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.





Untitled Document
Advertisements