ప్రధాని మోదీతో బండారు దత్తాత్రేయ భేటీ

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 06:11 PM

ప్రధాని మోదీతో బండారు దత్తాత్రేయ భేటీ

హర్యానా గవర్నర్ గా ఇటీవలే బండారు దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీని ఈరోజు ఆయన కలిశారు. హర్యానా గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మోదీని దత్తన్న కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా దత్తాత్రేయ క్షేమ సమాచారాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. అలాగే హర్యానా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి కూడా వాకబు చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గవర్నర్లు కీలక పాత్రను పోషించాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. సమావేశానంతరం దత్తాత్రేయ స్పందిస్తూ... మోదీ భేటీ తనకు మరింత స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా దత్తన్న కలిశారు. కిషన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నామని ఆయన తెలిపారు.

Untitled Document
Advertisements