కాలు మీద కాలేసుకుంటే ABN రాధాకృష్ణ ఫీలయ్యాడు: JD చక్రవర్తి

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 07:19 PM

కాలు మీద కాలేసుకుంటే ABN రాధాకృష్ణ ఫీలయ్యాడు: JD చక్రవర్తి

ప్రస్తుత కాలంలో జేడీ చక్రవర్తికి సరైన హిట్ లేదు. వరుస పరాజయాలను వెంటాడుతున్నాయి. అయితే తనకు హిట్లు వచ్చినప్పుడు పొంగిపోలేదు.. పరాజయాలు వచ్చిన కుంగిపోనూ లేదు. అప్పుడు ఏ హోప్స్‌తో అయితే సినిమాలు చేశానో ఇప్పుడు కూడా అదే హోప్స్‌తో పనిచేస్తున్నానంటారు జేడీ చక్రవర్తి. అయితే వర్మ శిష్యుల్లో ఒకరైన జేడీకి ఆయనలాగే కాస్త పొగరు ఎక్కువనే టాక్ ఉంది.

అయితే దాన్ని పొగరు అని అనుకుంటే నేనేం చేయలేనని.. దాన్ని నేను కాన్ఫిడెన్స్ అని అనుకుంటా అని చెప్తూ దీన్నే పొగరు అని అనుకుంటే జర్నలిస్ట్‌లు చేసేది ఏంటి? అని తిరిగి ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఏబీఎన్ రాధాకృష్ణ తనని ఇంటర్వ్యూకి పిలిచి తనతో ఎలా ప్రవర్తించారో వివరించారు.

‘ఒక విషయం మనం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటే.. అది చూసేవాళ్లకి పొగరుగా కనిపించవచ్చు. నేను ప్రముఖ ఛానల్‌కి ఇంటర్వ్యూకి వెళ్లా.. పేరు చెప్పమన్నా చెప్తా.. నాకే ఇబ్బంది లేదు. ఏబీఎన్ ఛానల్‌కి ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు నేను ఎప్పటిలాగే కాలు మీద కాలువేసుకుని కూర్చున్నా.. ఆర్కే (రాధాకృష్ణ) గారి ముందు అలా కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం ఆయనకు నచ్చలేదు. ఏంటి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు ఇది పద్దతి అనుకుంటున్నారా? అని నన్ను అడిగారు. పొగరుగా అనిపించట్లేదా? అన్నారు.

అప్పుడు నేను ఏం అన్నానంటే.. ‘ఏవండీ నా కాలు మీద నేను కాలుపెట్టుకుంటే అది పొగరు అని నాకు ఇన్నాళ్లూ తెలియలేదు. మీ తొడ మీద నా కాలు పెట్టడం పొగరు అనుకున్నా.. దాన్ని మీరు పొగరు అనుకుంటే ఎలా.. ఇది పొగరు కాదు.. నా కంఫర్ట్. నా కంఫర్ట్‌ని మీరు పొగరు అంటే నేను ఒప్పుకోను. కాలు మీద కాలు వేసుకుంటే నీ (Vemuri Radhakrishna) మీద నాకు రెస్పెక్ట్ లేదని నువ్ ఎలా అనుకుంటావ్. సో.. చాలామంది నా యాటిట్యూడ్‌ని పొగరు అనుకుంటారు.

పెద్ద చిన్న అనేది మన ప్రవర్తనలో.. మనం ఇచ్చే గౌరవంలో ఉండాలి.. నా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఇది మర్యాద కాదు అని ఎక్కడైనా ఉందా?? నేను దాసరి నారాయణ గారి ముందు కూర్చుని ఏం దాసరి అంటే తప్పు. అంతేతప్ప నా పర్సనల్ పార్ట్ మీద నా పర్సనల్ పార్ట్ పెట్టడం అవివేకం ఎలా అవుతుంది.

పెద్దవాళ్ల దగ్గర నేను పద్దతిగానే ఉంటా.. రాఘవేంద్రరావుగారితో నేను ‘బొంబాయి ప్రియుడు’ సినిమా చేశా. నేను బయట ఎక్కడో ఉంటే ఆయన ఫోన్ చేశారు.. సార్ డైరెక్టర్ గారూ చెప్పండి అన్నా.. ఫోన్ వినిపించక కట్ అయిపోయింది.. రెండోసారి చేస్తే ‘సార్ రాఘవేంద్రరావు గారూ’ అని అన్నా.. అలా రెండు మూడుసార్లు అయిన తరువాత నేను ‘రాఘు’ అని అనేశా.. ఆయన అవతల నుంచి హా!! చక్రి ఇందాకనుంచి ఫోన్ వేరే ఎవరో లిఫ్ట్ చేస్తున్నారని అన్నారు. షూటింగ్ టైంలో ‘జేడీ చక్రవర్తి’ అనే పేరు చాలా పెద్దదిగా ఉంది.. చక్రి అని పిలిస్తే అభ్యంతరమా? అన్నారు.. ‘కె. రాఘవేంద్రరావు’ అంటే ఇంకా పెద్దగా ఉంది ‘రాఘు’ అని పిలిస్తే అభ్యంతరమా? అని అడిగా.. ఆయన స్పోర్టివ్‌గా ‘అబ్బా.. మా నాన్న గారి తరువాత నన్ను రాఘు’ అని పిలుస్తానని అంటున్నది నువ్వే అలాగే పిలువు అన్నారు.. నేను ఆయన్ని అలా పిలిచానంటే ఆయనపై నాకు మర్యాద లేనట్టా?? గౌరవ ఇవ్వనట్టా?? మర్యాద అంటే మనం చూపించే బాడీ లాంగ్వేజ్ కాదు అని చెప్పారు జేడీ చక్రవర్తి.

Untitled Document
Advertisements