విశాఖపట్నంలో విషాద ఘటన...వాగులో పడి నలుగురు చిన్నారులు మృత్యువాత

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 08:16 PM

విశాఖపట్నంలో విషాద ఘటన...వాగులో పడి నలుగురు చిన్నారులు మృత్యువాత

విశాఖపట్నం జిల్లాలో నలుగురు చిన్నారులు ఒకేసారి మృత్యువాతపడ్డారు. పెద్దేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం జమ్మాదేవిపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ఎల్‌.గవరవరం గ్రామంలో బట్టలు ఉతికేందుకు పెద్దలు వెళ్లగా, వారి వెంట.. నీలాపు మహేందర్ (7), వంత్తాల వెంకట ఝాన్సీ (10), వంత్తాల షర్మిల (7)వంత్తాల ఝాహ్నవి (11) వెళ్లారు. అయితే, సోమవారం మధ్నాహం పిల్లలు పెద్ద యేరు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఊబిలో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే పిల్లలు ప్రాణాలు కల్పోయారు.

ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందినవారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నవయసులోనే పిల్లలు కన్నుయూమడంతో అంతా విషాదంలో మునిగిపోయారు.

Untitled Document
Advertisements