'ఆర్ఆర్ఆర్': ఫ్రెండ్షిప్ డే కానుకగా ఫస్టు సాంగ్ రిలీజ్

     Written by : smtv Desk | Tue, Jul 27, 2021, 02:12 PM

 'ఆర్ఆర్ఆర్':  ఫ్రెండ్షిప్ డే కానుకగా  ఫస్టు సాంగ్ రిలీజ్

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా చారిత్రక నేపథ్యంతో కూడిన పాత్రలను పోషిస్తూ ఉండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు .. స్పెషల్ వీడియోలు అంతకంతకూ ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చాయి.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్టు సాంగును రిలీజ్ చేయడానికి ముహూర్తం కుదిరింది. ఫ్రెండ్షిప్ డే కానుకగా ఆగస్టు 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఫస్టు సాంగును రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ఒక పోస్టర్ ను వదిలారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాట, ఒకేసారి 5 భాషల్లో విడుదల కానుంది.

ఈ పోస్టర్ లో కీరవాణితో పాటు అనిరుధ్ రవిచంద్రన్ .. విజయ్ ఏసుదాసు తదితరులు కనిపిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ నటీనటులతో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Untitled Document
Advertisements