65 శాతం మంది సగటు వయసు 33 ఏళ్లే

     Written by : smtv Desk | Wed, Jul 28, 2021, 02:47 PM

65 శాతం మంది సగటు వయసు 33 ఏళ్లే

మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయని, బిజినెస్ కోసం అవసరమైన మంచి వాతావరణాన్ని సృష్టించామని ఆయన అన్నారు. ‘వీ హబ్’లో ఇవ్వాళ నిర్వహించిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్టార్టప్ ఆలోచనలను పరిశీలించారు.

మంచి ఆలోచనలుంటే తప్పకుండా ప్రోత్సహిస్తామని, సరైన మార్కెటింగ్ కు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మనది అత్యంత యువ దేశమని, 65 శాతం మంది సగటు వయసు 33 ఏళ్లేనని అన్నారు. సమాజానికి ఓ ఉత్పత్తి చాలా అవసరమని భావిస్తే.. తెలంగాణ ప్రభుత్వం దానికి సహకరిస్తుందన్నారు.

Untitled Document
Advertisements