ఈ చిట్కాలతో ఎసిడిటీ నుండి ఉపశమనం!

     Written by : smtv Desk | Mon, Sep 13, 2021, 02:16 PM

ఈ చిట్కాలతో ఎసిడిటీ నుండి ఉపశమనం!

ఎసిడిటీ ఇది అనుభవించే వారికే తెలుస్తుంది...మనుషులను ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏం తినాలన్నా.. ఏం జరుగుతుందనే భయం బాధితులను వెంటాడుతుంది. పుల్లటి తేన్పులు.. ఛాతిలో మంట.. గొంతులో ఏదో అడ్డుపడినట్లు నిండుగా ఉండటం వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఫాస్ట్ కల్చర్లో మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి ,నిద్రలేమి ఇలా పలు కారణాల వల్ల ఈ సమస్య మనల్ని వేధిస్తుంది. ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లేకపోయినప్పటికి ఆహారం విషయం జాగ్రత్తలు పాటిస్తూ.. కొన్ని చిట్కాలను ప్రయత్నిస్తే.. తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.
❂ ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది.
❂ రోజు ఉదయాన్నే పరగడపున పుదీనా ఆకులు నమలండి.
❂ భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి.
❂ భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోండి. దీనవల్ల ఎసిడిటీ సమస్య ఉండదు.
❂ లవంగాల్లో ఉండే కార్మెటివ్ గుణాలు జీర్ణాశయంలో ఆహారాన్ని త్వరగా కిందికి పంపిస్తాయి.
❂ ఎసిడిటీ ఉన్నవారు కొద్ది అల్లం తినొచ్చు. కానీ, మోతాదు మించితే మరో సమస్య వస్తుంది.
❂ ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం నిమ్మ, బెల్లం, పెరుగు, అరటి పండు తీసుకోవచ్చు.
❂ ఎసిడిటీ బాధితులు బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, వెల్లులి, క్యారెట్, మునగ కాయలు తీసుకోవచ్చు.
❂ కాఫీ, టీలకు దూరంగా ఉండండి.
❂ శీతలపానీయాల జోలికి అస్సలు వెళ్లొద్దు.
❂ హెర్బల్ టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు.
❂ రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి.
❂ ఆకలి వేసినప్పుడు పుచ్చకాయ, అరటి పండ్లు, దొసకాయలు తినండి.
❂ కొబ్బరి నీళ్లు ఎసిడిటీ నుంచి ఉపశమనానికి చాలా మంచిది.
❂ నిత్యం ఒక గ్లాస్ పాలు తాగండి.
❂ కారానికి దూరంగా ఉండండి.
❂ స్మోకింగ్‌కు దూరంగా ఉండండి.
❂ పైన పేర్కొన్న ఆహారాల్లో ఏది తీసుకోవాలన్నా వైద్యుల సూచన తప్పనిసరి.





Untitled Document
Advertisements