భూమి పుట్టక ఎన్ని రకాలు?

     Written by : smtv Desk | Mon, Sep 13, 2021, 06:15 PM

భూమి పుట్టక ఎన్ని రకాలు?

పురాణాల ప్రకారం భూమి ఒక దేవత. భూమి పుట్టుక దాని మూల దేవతలను గురించి ఎన్నో రకాల కథలు ఉన్నాయి. భూదేవి బ్రహ్మ దేవుని కుమార్తె. ఈమెను మహావిష్ణువు వివాహమాడాడు. మనం నివసించే భూమి మృత పిండం. దీని మూల దేవత భూదేవి. పురాణాల ప్రకారం భూమి పుట్టుక ప్రధానంగా మూడు రకాలు. ఎంతో కాలం క్రితం భూమి ద్రవరూపంలో ఉంది. శివుడు తన తోడనుకో సి ఓ రక్తపు చుక్కను వేయగా అది గుడ్డు గా మారింది. దానిని ఖండించగా ఓ మానవుడు ఉద్భవించాడు. అదే ప్రకృతి. ఒక భాగం భూమి గా రెండో భాగం ఆకాశం గా మారాయి. ఎక్కడ చూసినా నీరు ఉండంగా మహావిష్ణువు నీటిపై తేలుతూ ఉండగా విష్ణువు నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణువు చెవుల నుండి ద్రవం స్రవించి, అందుండి మధుకైటభులు జన్మించి బ్రహ్మ పై యుద్ధానికి వెళ్లారు. శ్రీ మహా విష్ణువు వారిని వధించగా వారి చిక్కని రక్తము నీటితో కలిసి భూమి ఏర్పడింది. ప్రహ్లాదుడు హిరణ్యకుడు సోదరుడైన హిరణ్యకశ్యపుని కుమారుడు. ప్రహ్లాదుని అతని తండ్రి ఓ భవంతి నుండి క్రిందకు తోయగా భూదేవి అతనికి అపాయం లేకుండా తన చేతిలోకి తీసుకుంది. పరశురాముడు భూమినంతటినీ జయించి కశ్యపునకు దానం ఎచ్చినండు వలన ఈమెను కాశ్యపి అని కూడా పిలుస్తారు.





Untitled Document
Advertisements