పార్వతి కోపానికి బలైన భృంగి!

     Written by : smtv Desk | Mon, Sep 13, 2021, 06:17 PM

పార్వతి కోపానికి బలైన భృంగి!

భృంగి ఇతడు శివభక్తుడైన ఓ మహర్షి. ఒకసారి కైలాసం వెళ్లి శివునికి ప్రదక్షణం చేయబోగా శివపార్వతులకు ఓకే శరీరులై వుండగా శివుని చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేయడం సాధ్యం కాక పురుగుగా మారి శివపార్వతులు కలిసిన భాగాన్ని తొలుచుకుంటూ వెళ్లి శివునికి మాత్రమే ప్రదక్షణము చేశాడు. ఇతని చర్యకు పార్వతి ఆగ్రహించి శరీరకంగా బలహీనుడవు కమ్మని శపించింది. అతని కాళ్ళు బలహీనమైన శరీరాన్ని మోయలేకపోగా మరలా శివుణ్ణి ప్రార్ధించగా అతని మూడవ ఇచ్చి అనుగ్రహించాడు.
2 శివుని వీర్యమును అగ్ని ధరించినప్పుడు రెండు బిందువులు గిరి ప్రస్థమున పడగా అందుండి భృంగి, మహాకాళి జన్మించారు. భృంగి శివుని ద్వారాపాలకుడయ్యాడు. పార్వతి వివస్త్రగా ఉన్నప్పుడు భృంగి పొరపాటున చూసాడు. ఆమె కోపించి మనుష్యజాతి యందు వానర ముఖముతో జన్మించమని శపించాడు. ఇతడు పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించగా మీకు మేము జన్మనిచ్చెదమని అని చెప్పారు. దక్షయజ్ఞ సమయమున శివుడు తన జుట్టుముడి ని కోపంతో నేలకు కొట్టగా భ్రుంగి బైరవుడిగా, మహాకాళి బేతాళుడై జన్మించారు.

Untitled Document
Advertisements