భైరవుడు బ్రహ్మ కపాలన్ని ఎక్కడ పాతిపెట్టాడు ?

     Written by : smtv Desk | Mon, Sep 13, 2021, 06:20 PM

భైరవుడు బ్రహ్మ కపాలన్ని ఎక్కడ పాతిపెట్టాడు ?

దక్షుడు యజ్ఞమునకు శివుని ఆహ్వానించక పోగా అతని సతిని అగౌరవపరచగా ఆమె యజ్ఞగుండంలో దూకింది. శివుడు వచ్చి ఉగ్రుడై తన జుట్టు ముడిని నేలకు విసిరి కొట్ట గా ఓ వికృత రూపం శివుని అనుమతి లేకుండానే దేవతలను సంహరించగా శివుడు వృక్షంగా మారమని శపించాడు. ఇంతలోనే శివుడు కరుణించి దేవుళ్లను పూజించే వారికి సంపూర్ణ అనుగ్రహం కావాలంటే భైరవుని కూడా పూజించాలని శాపవిమోచనం చేశాడు. దేవతలను ఓడించాడు కనుక ఈ చెట్టును దమనకం అని, తాతిరి వృక్షమని పిలుస్తారు. ఒకసారి బ్రహ్మ విష్ణువులు గర్వంతో వాదులాడుచుండగా బ్రహ్మ శివుడిని కూడా ఎగతాళి చేయగా శివుని ఆగ్రహజ్వాల నుండి భైరవుడు జన్మించి బ్రహ్మ ఐదవ తలని తుంచి వేశాడు. బ్రహ్మ శిరస్సును తుంచటం వల్ల బ్రహ్మ హత్యా పాతకం మంటూ కొనగ దానిని పోగొట్టుకొనుటకు బ్రహ్మ కపాలముతో భిక్షాటన చేస్తూ బయలుదేరగా శివుడు' బ్రహ్మ హత్య ' అను స్త్రీని సృష్టించి అతని వెనుక పంపాడు. ఇతడే ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినా ఆ పాతకం పోనందున శివుని ఆజ్ఞపై బ్రహ్మ కపాలన్ని వారణాసిలో పాతిపెట్టాడు.

Untitled Document
Advertisements