మధుకైటభులను విష్ణుమూర్తి తన ఊరువులపై ఎందుకు చంపాడు!

     Written by : smtv Desk | Mon, Sep 13, 2021, 06:23 PM

మధుకైటభులను విష్ణుమూర్తి తన ఊరువులపై ఎందుకు చంపాడు!

మహా విష్ణువు నీటిపై శయనించి ఉండగా నాభి నుండి బ్రహ్మ చెవుల నుండి మధుకైటభులు జన్మించారు. వారు ఎక్కడి నుంచి జన్మించారు తెలియక శక్తి వలన జన్మించితిమని తలచి ఆమెను ప్రార్ధించి ఆమె ప్రసాదముచే మహా బలవంతులై బ్రహ్మను బాధపెట్టు చుండగా బ్రహ్మ విష్ణువును ప్రార్థించగా విష్ణుమూర్తి వారితో పోరాడ సాగాడు. ఎంత పోరాడిన వారిని గెలవలేకపోయారు. నాకు కొంత విశ్రాంతి ఇవ్వమని వారిని కోరగా అందుకు వార అంగీకరించారు. విష్ణువు శక్తిని ప్రార్థించగా ఆమె వారిని మోహితులుగా జేసింది. అప్పుడు విష్ణువు" దానవులరా మీరు నాతో పోరాడలేరు, నన్ను ప్రార్ధించి శరణు వేడుకొమనగా నీవే ప్రార్ధింవుము వరములు ఇస్తాము అన్నారు. అంత విష్ణుమూర్తి మీకు నాచే హతులగునట్లు వరమిమ్మని కోరాడు. అంతట వారికి ఒక సమస్య ఏర్పడి అట్లాయిన మమ్ములను జలము లేనిచోట చంపుమన్నారు. విష్ణుమూర్తి తన ఊరువులను పెంచి వారిని తన ఊరువులపై నుంచి చంపాడు. ఆ విధంగా వారి మేధస్సు తెగిపడి భూమి గా మారింది.





Untitled Document
Advertisements