మన్మథుడు ఎలా భస్మం అయ్యాడు!

     Written by : smtv Desk | Mon, Sep 13, 2021, 06:24 PM

మన్మథుడు ఎలా భస్మం అయ్యాడు!

* విష్ణుమూర్తి సంతానమునకు శివుని ప్రార్థించగా మన్మథుడు జన్మించాడు. కానీ విష్ణువు పార్వతిని ప్రార్ధించుక పోవుటచే ఆమెకు కోపము వచ్చి విష్ణుమూర్తికి జన్మించు కుమారుడు శివుని నేత్రగ్నికి భస్మమగుగాకయని శపించింది. అప్పుడు విష్ణువు ప్రార్ధించగా పుట్టిన కుమారుడు మరల బ్రతుకునని అనుగ్రహించింది. అలా జన్మించినవాడే మన్మథుడు. ఇతను గొప్ప అందగాడు. ఇతని భార్య రతీదేవి. ఈమె మన్మథుని వామ భాగము నుండి జన్మించింది. పుష్పము లే ఇతని ఆయుధములు. ఇతని వాహనము చిలుక. ఒకసారి తన బాణములతో బ్రహ్మను కూడా బాధ పెట్టాడు. ఆ బాధ వల్ల బ్రహ్మ తన కుమారై అయిన సరస్వతితో రమించాడు. తరువాత సిగ్గుపడి అందుకు కారణము మన్మధుడే యని తలచి కొద్దికాలంలోనే భస్మమగుదువని శపించాడు. అతడు బ్రహ్మను ప్రార్థించగా యదువంశంలో తిరిగి జన్మింతువని బ్రహ్మదేవుడు తెలియజేశాడు.
* బ్రహ్మ వరప్రసాది అయిన తారకాసురుని బాధ భరించలేక దేవతలు బ్రహ్మను శరణు వేడగా శివుని కుమారుడు మాత్రమే అతడిని సంహరించగలడని చెప్పాడు. ఇంద్రుడు శివుడు సతీహితుడుగాన మన్మథుని పొగిడి శివుని గెలిచి పార్వతిని వివాహమాడునట్లు చేయమని కోరాడు. శివుడు తపస్సు చేసుకొనుచుండనుగా పార్వతి శివుని సపర్యలు చేయుచు అచటనే సంచరించు చుండగా మన్మథుడు శివుని తన బాణములతో కొట్టగా శివుని మనసు చలించి ఎవడిట్లు చేసేనని కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు.





Untitled Document
Advertisements