సీతకు ఆ పేరెలా వచ్చింది!

     Written by : smtv Desk | Tue, Sep 14, 2021, 12:11 PM

సీతకు ఆ పేరెలా వచ్చింది!

జనక మహారాజు మిధిలా నగరాన్ని రాజధానిగా విదేహ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. రాజ ఋషిగా పేరు గాంచాడు. ఆయన సంతానం కోరి ఒక యజ్ఞం చేయ తలపెట్టి యజ్ఞ భూమిని దున్నుచుండగా నాగలి చాలులో ఒక బంగారు పెట్టె దొరికింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉంది. చంద్రబింబంలా వెలిగిపోతున్న ఆ పాపను సాక్షాత్తు లక్ష్మి దేవిగా భావిస్తూ సంతానం లేని జనకుడు అమితానందంతో ఆమెను పెంచుకున్నాడు. నాగలి చాలులో లభించినది కనుక ఆమెకు సీత అని నామకరణం చేసాడు. జనకుని పుత్రిక కాబట్టి ఆమెకు జానకి అని మిధిలానగర రాజపుత్రి కాబట్టి మైధిలి అనే పేరులు స్థిరపడినవి. లక్ష్మిదేవే సీతగా భూలోకమున అవతరించింది. రూపంలో చాల చక్కనైనది సీత జనకుడు చాల అల్లారు ముద్దుగా పెంచి పెద్ద జేశాడు. యుక్త వయసు వచ్చిన సీతా దేవికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు జనకుడు. సీతకు తగిన వరుని కోసం వేతకసాగాడు. జానక మహారాజు ఇంట్లో తన పూర్వీకుల నుండి లభించిన శివధనుస్సు ఉంది. అది ఎంతో బరువైనది. మహాపురుషులు తప్ప దానిని ఎవరూ ఎత్తలేరు. ఒక రోజు సీతాదేవి తన చెలికత్తెలతో ఆటలాడుకుంటూ పూబంతి చెండు ఆ శివదనుస్సు కిందకు వెళ్ళగా సీత ఆ ధనుస్సును ఎత్తి పక్కన పెట్టి పుచెండును తీసుకుని మళ్ళీ ధనుస్సు యధాస్థానంలో ఉంచింది. ఆ విషయం తెలుసుకున్న జనకుడు ఆశ్చర్యంతో ఈమె మానవ మాతృరాలు కాదు. దేవతా సంభుతురాలు అనుకున్నాడు. సీత కోసం తగిన వరుడిని ఎంపిక చేయుటకు సీతాదేవే సహకరించినదిగా భావించి శివధనుస్సు ఎత్తి ఎక్కుపెట్టిన వీరునికి సీతను ఇచ్చి వివాహం చేస్తామని ప్రకటించాడు. కాని ఎంతోమంది వీరులు దానిని ఎత్తలేకపోయారు. రోజులు గడిచిపోతున్నవి. జనకుడు సీతకు వివాహం చేయలేనేమో? అని విచారంతో, దిగులుతో ఉన్నాడు.

Untitled Document
Advertisements