ఈ చిట్కాలు పాటిస్తే పట్టుకుచ్చులాంటి జుట్టు మీ సొంతం!

     Written by : smtv Desk | Tue, Sep 14, 2021, 12:29 PM

ఈ చిట్కాలు పాటిస్తే పట్టుకుచ్చులాంటి జుట్టు మీ సొంతం!

అందం విషయంలో మొదటి ప్రాధాన్యత జుట్టుదే. అయితే కొంతమంది తమ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని బాధపడిపోతుంటారు. వేసవికాలం నుంచి వర్షాకాలం రాగానే వాతావరణంలో తేమ వల్ల చుండ్రు ఏర్పడుతుంది. అంతేకాకుండా వెంట్రుకలు పెలుసుబడి జుట్టు పలుచబడుతుంది. దీంతో వెంట్రుకలు ఊడిపోతుంటాయి. చాలామందికి వర్షాకాలంలో ఇలా జరుగుతుంది.
అయితే మీరు అదనపు జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ సీజన్‌లో జుట్టు రాలిపోకుండా తగుచర్యలు తీసుకోవచ్చు. వర్షాకాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది తడుస్తుంటారు. అయితే అలాంటి వారు ముఖ్యంగా వర్షంలో తడిసే అమ్మాయిలు జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

1) జట్టు రాలే సమస్యకు ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిరసంలోని యాంటిబాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను ముక్కలుగా కోసి వాటిని నుంచి వచ్చే రసాన్ని దూదితో మీ జుట్టుపై అప్లై చేయండి. ఇలా 30-50 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అనంతరం మీ జుట్టును నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం మీ జుట్టు పలుచబడకుండా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది.
2) మందార ఆకులు, మందార పువ్వులను గ్రైండ్ చేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ మాడుకు, జుట్టుకు అప్లై చేసి ఒక గంట సేపు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
3) అలోవెరా(కలబంద) నుంచి గుజ్జు తీసి దానిని మీ మాడుకు పట్టించాలి. ఒక గంట లేదా రెండు గంటలు ఇలా ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
4) తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి కుదుళ్లు గట్టిపడతాయి.
5) గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో .. జుట్టుకు పెట్టుకుంటే శిరోజాలకు అంత ఆరోగ్యం కూడా. గోరింటాకు బాగా నూరి దాన్ని తలకు అద్దుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా ఫలితం కనిపిస్తుంది.
6) జుట్టు రాలే సమస్యకు వేప మంచి ఫలితాన్ని ఇస్తుంది. వేప నూనెను తలకు రాసుకుంటే జట్టు రాలే సమస్యతో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్నా తగ్గుతాయి. అదే విధంగా వేపాకు కూడా బాగా నూరి పేస్ట్ లా తయారు చేసి దాన్ని తలకు పట్టించినా

✤ జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచేవి ప్రోటీన్లు. ప్రోటీన్లు తగ్గిన కొద్దీ జుట్టు పలచబడిపోతుంది. అందుకు ప్రోటీన్లు సమృద్దిగా ఉండే పాలకూర, క్యాలీఫ్లవర్,కీరా, క్యాప్సికం,టమాటా వంటి కూరగాయలని రోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే సల్ఫర్ అమినో యాసిడ్స్ కూడా జుట్టు ఒత్తుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. సోయాబీన్స్ , రాగి, బీట్రూట్, నువ్వులు, అరటి,, ఖర్జూరం, ద్రాక్షా, కోడిగుడ్డు ల నుంచి ఈ సల్ఫర్ అమినో ఆమ్లాలు పుష్కలంగా దొరుకుతాయి.
✤ జుట్టు సిల్కీగా, మెరుస్తూ కావాలంటే ఆకుకూరలు, నారింజ, అన్ని రకాల కూరగాయలు, రోజువారీ, ఆహారంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి విటమిన్ Aని అందిస్తాయి. అలాగే చికెన్, పాలకూర, నారింజ, బెండ, బీట్రూట్, గోదుమలు కూడా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫోలిక్ యాసిడ్, బీ- 12 లు అధికంగా ఉంటాయి. ఇక అటుకులు, రాగులు, వేరుశెనగ, బాదం పప్పులు, పాలు, పాల ఉత్పత్తుల నుంచి ఇనుము, జింక్ లభిస్తాయి. ఇవి జుట్టును రాలిపోకుండా చేస్తాయి. ఇలా జుట్టుకు ఏ ఆహారం కావాలో తెలుసుకుని తింటే చాలు పట్టుకుచ్చులాంటి జుట్టు సొంతం అవుతుంది.





Untitled Document
Advertisements