డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన ముమైత్‌ఖాన్‌

     Written by : smtv Desk | Wed, Sep 15, 2021, 11:21 AM

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన ముమైత్‌ఖాన్‌

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు సినీ న‌టి ముమైత్ ఖాన్‌ను విచారిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ, న‌వ‌దీప్‌ను విచారించిన విష‌యం తెలిసిందే.

ఇదే కేసులో నోటీసులు అందుకున్న నేప‌థ్యంలో ముమైత్ ఖాన్ హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యంలో అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రైంది. ముమైత్ ఖాన్‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నారు. అలాగే, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆమెకు ఉన్న సంబంధాలు, జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై ఆరా తీస్తున్నారు.

కాగా, గ‌త రెండు వారాలుగా ఈ కేసులో ఈడీ విచార‌ణ కొన‌సాగుతోంది. రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు విచారించ‌నున్నారు.

Untitled Document
Advertisements