'సంక్రాంతి' కానుకగా 'సర్కారువారి పాట'

     Written by : smtv Desk | Wed, Sep 15, 2021, 11:24 AM

'సంక్రాంతి' కానుకగా 'సర్కారువారి పాట'

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను 'దుబాయ్' లో చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను 'గోవా'లో పూర్తి చేశారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా హైదరాబాద్ లో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా చిత్రీకరణ జరుపుకుందని అంటున్నారు.

ముందుగా చెప్పిన ప్రకారమే 'సంక్రాంతి' కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో అంచనాలు పెరిగిపోయాయి. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మైత్రీ - 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements