ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య కాళ్లు మొక్కిన భర్త.. నెటిజన్లు ఫిదా

     Written by : smtv Desk | Wed, Sep 15, 2021, 11:51 AM

ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య కాళ్లు మొక్కిన భర్త.. నెటిజన్లు ఫిదా

హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లాడిన తర్వాత.. వధువు వచ్చి భర్త కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ ఆచారానికి ఒక వరుడు కొత్త అర్థం చెప్పాడు. భార్య తన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవడంతో, తాను కూడా ఆమె పాదాలకు నమస్కరించాడు. భార్యాభర్తలిద్దరూ సమానమనే ఉద్దేశ్యంతోనే అతను ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లందరూ ఆ వరుడు చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. అతన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ వధూవరులిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ‘లవ్ మ్యారేజ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.

Untitled Document
Advertisements