ఎస్‌బీఐ తీపికబురు....వడ్డీ రేట్ల తగ్గింపు

     Written by : smtv Desk | Wed, Sep 15, 2021, 12:13 PM

ఎస్‌బీఐ తీపికబురు....వడ్డీ రేట్ల తగ్గింపు

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ గ్రహీతలకు ఊరట కలిగించేందుకు బేస్ రేటును తగ్గించింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి వస్తుంది.

స్టేట్ బ్యాంక్ బేస్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేసింది. దీంతో బేస్ రేటు 7.45 శాతానికి దిగొచ్చింది. అలాగే స్టేట్ బ్యాంక్ ప్రైమ్ లెండింగ్ రేటును కూడా 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ రేటు 12.2 శాతానికి దిగివచ్చింది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బేస్ రేటును నిర్ణయిస్తుంది. ఈ రేటుకు తక్కువగా బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదు. అన్ని బ్యాంకులకు ఈ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ బేస్ రేటును 7.3 శాతం నుంచి 8.8 శాతం వరకు నిర్ణయించింది.

ఎస్‌బీఐ బేస్ రేటు తగ్గింపుతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఇకపోతే ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇటీవలనే రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను 0.15 శాతం మేర తగ్గించేసింది. దీంతో వడ్డీ రేటు 6.5 శాతానికి దిగొచ్చింది.





Untitled Document
Advertisements