నిందితుడు రాజుపై నాని ట్వీట్

     Written by : smtv Desk | Wed, Sep 15, 2021, 12:52 PM

నిందితుడు రాజుపై నాని ట్వీట్

హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో తీవ్ర‌ క‌ల‌క‌లం రేపిన ఆరేళ్ల బాలిక హ‌త్యోదంతం నిందితుడు రాజు గురించి స‌మాచారం అందిస్తే రూ.10 లక్ష‌లు ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సినీన‌టుడు నాని దీనిపై స్పందిస్తూ, పోలీసులు చేసిన ట్వీట్ ను ఆయ‌న రీట్వీట్ చేశాడు. 'బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు' అంటూ ఆయ‌న రాజును ఉద్దేశించి పేర్కొన్నాడు.

మ‌రోవైపు, బాలిక కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి సింగరేణి కాల‌నీకి జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జూబ్లీహిల్స్ లోని త‌మ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరనున్నారు. కాసేప‌ట్లో ఆయ‌న వారి ఇంటికి చేరుకోనున్నారు. అలాగే, ఈ రోజు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కూడా బాలిక ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు.

కాగా, బాలిక‌పై రాజు అత్యాచారానికి పాల్ప‌డి, ఆ త‌ర్వాత చంపేసి, అక్క‌డి నుంచి పారిపోయాడ‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజును ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని, లేదంటే త‌మ‌కు అప్ప‌గించాల‌ని అత‌డి అంతుచూస్తామ‌ని అంటున్నారు.

Untitled Document
Advertisements