ప్రభాస్-రాజమౌళిలతో మైత్రి మూవీ మేకర్స్ భారీ సినిమా?

     Written by : smtv Desk | Wed, Sep 15, 2021, 12:53 PM

ప్రభాస్-రాజమౌళిలతో మైత్రి మూవీ మేకర్స్ భారీ సినిమా?

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్‌లో RRR రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా.. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిన్నచిన్న షాట్లు మినహా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయినట్లు ఈ మధ్యకాలంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారా.. అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేస్తారు అని ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ధృవీకరించారు. మహేష్ కోసం తాను ఓ ఫారెస్ట్ అడ్వెంచర్ కథను ఇప్పటికే సిద్ధం చేసిట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళి, మహేష్ కాంబోలో సినిమా ప్రారంభం కానుందని టాక్ తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మరో సరికొత్త వార్త ఇప్పుడు రాజమౌళి అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. అదేంటంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ.. రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని త్వరలో నిర్మించనుందని తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ తెరకెక్కని భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని టాక్‌. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు మాత్రమే నడిచినట్లు తెలుస్తోంది. పూర్తి కథ ఏంటి? కథానాయకుడు ఎవరు? అన్న విషయాలు తెలియరాలేదు. అయితే ఇది మహేష్‌ హీరోగా రూపొందే సినిమానా.. లేక.. ఇది వేరే సినిమా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.

Untitled Document
Advertisements