ఎస్‌బీఐ బంపరాఫర్...రూ.లక్షల్లో బెనిఫిట్!

     Written by : smtv Desk | Fri, Sep 17, 2021, 10:53 AM

ఎస్‌బీఐ బంపరాఫర్...రూ.లక్షల్లో బెనిఫిట్!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కీలక నిర్ణయం తీసుకుంది. రుణ గ్రహీతలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పండుగ సీజన్ ముందు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది.

స్టేట్ బ్యాంక్ తాజాగా హోమ్ లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా రుణ వడ్డీ రేట్లను 6.7 శాతానికి తగ్గించేసింది. ఇది వరకు రూ.75 లక్షలకు పైన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 7.15 శాతంగా ఉండేది. అంటే వడ్డీ రేటు గణనీయంగా తగ్గిందని చెప్పుకోవచ్చు.

అర్హత కలిగిన రుణ గ్రహీతలకు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 45 బేసిస్ పాయింట్ల తగ్గిందని ఎస్‌బీఐ తెలిపింది. 30 ఏళ్ల టెన్యూర్‌తో రూ.75 లక్షల హోమ్ లోన్‌పై ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో ఏకంగా రూ.8 లక్షలు ఆదా కానున్నాయి. వేతన జీవులతో పోలిస్తే.. స్వయం ఉపాధి పొందుతున్న వారిపై 15 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

అయితే ఇక్కడ ఎస్‌బీఐ రుణ గ్రహీతలకు మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. అయితే వడ్డీ రేటు తగ్గింపు బెనిఫిట్ లోన్ తీసుకునే వారి క్రెడిట్ ప్రొఫైల్ ప్రాతిపదికన మారుతుందని గమనించాలి.





Untitled Document
Advertisements