ఈ స్కూటర్లకు ఫుల్ డిమాండ్...ఒక్క రోజులో రూ.600 కోట్లు

     Written by : smtv Desk | Fri, Sep 17, 2021, 10:54 AM

ఈ స్కూటర్లకు ఫుల్ డిమాండ్...ఒక్క రోజులో రూ.600 కోట్లు

పండుగ సీజన్ వచ్చేసింది. కొత్తగా ఇంటికి టూవీలర్ తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా స్కూటర్ కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? దీని కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని నిర్ణయించుకున్నాయి? అయితే మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు.

ఎందుకంటారా? దీనికి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎంతలా అంటే.. సెకన్‌కు 4 స్కూటర్లను విక్రయించారట. ఇలాంటి అద్భుతమైన స్కూటర్ ఏంటని ఆలోచిస్తున్నారా? అదే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్‌కు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్క రోజులోనే ఓలా తన స్కూటర్లను విక్రయించి రూ.600 కోట్లకు పైగా పొందింది. భవీశ్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపోతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.75 వేల నుంచి ప్రారంభమౌతోంది. రేటు రాష్ట్రం ప్రాతిపదికన మారొచ్చు.





Untitled Document
Advertisements