చై-సామ్ ల విడాకుల వ్యవహారం...అక్కినేని కోడలికి భరణంగా 300 కోట్లు?

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 11:07 AM

చై-సామ్ ల విడాకుల వ్యవహారం...అక్కినేని కోడలికి భరణంగా 300 కోట్లు?

అక్కినేని ఫ్యామీలీ ఇష్యూ ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఎక్కడచూసినా సమంత- నాగ చైతన్య విడాకుల ఇష్యూపైనే చర్చలు నడుస్తున్నాయి. గత నెల రోజులకు పైగా చై-సామ్ డివోర్స్ ఇష్యూ వైరల్ అవుతున్నా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జనాల్లో ఇది నిజమే అనే అనుమానాలు ముదిరాయి. దీనికి తోడు చై-సామ్ డివోర్స్ ఇష్యూపై జోరుగా వస్తున్న వార్తలు అక్కినేని అభిమానుల్లో కంగారు పుట్టిస్తున్నాయి. సమంత విడాకుల వెనుక కారణాలు, నాగ చైతన్య ఇచ్చే భరణం అంశాలు ఇప్పుడు మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

ఎప్పుడైతే సమంత తన ట్విట్టర్ ఖాతా నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించిందో అప్పటినుంచి రూమర్స్ మొదలయ్యాయి. రోజు రోజుకూ ఈ వార్తల ప్రవాహం మరింత ఎక్కువ కావడంతో జనం ఫోకస్ అంతా చై-సామ్ విడాకుల వ్యవహారంపైనే పడింది. ఈ ఇద్దరూ ఇప్పటికే చాలా సార్లు ఫ్యామిలీ కోర్టుకు హాజరై కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారని తెలుస్తుండటం, సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్న కొటేషన్స్, తిరుమలలో మీడియా మీద సమంత చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఈ ఇష్యూపై ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టాయి.

ఇంతలా హాట్ టాపిక్ అవుతున్న ఈ విషయమై జనాల్లో మరో రకమైన చర్చ మొదలైంది. చై- సామ్ డివోర్స్ ప్రాసెస్ మరో రెండు మూడు నెలల్లో పూర్తి కానుందని, స్థిర, చర ఆస్తులతో కలిపి సమంతకు భరణంగా 300 కోట్లకు పైగా నాగ చైతన్య ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటిదాకా ఈ విడాకుల వ్యవహారంపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా వైరల్ అవుతున్న ఇలాంటి విషయాలు అక్కినేని అభిమానుల్లో ఆందోళన నింపుతున్నాయి.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని అక్కినేని ఫ్యామిలీ ఆంక్షలు పెట్టినా సమంత పట్టించుకోలేదట. హాట్ ఫోటోషూట్స్, గ్లామరస్ రోల్స్, అందాల ఆరబోత అక్కినేని ఫ్యామిలీకి రుచించలేదట. ఇదే చై- సామ్ నడుమ గ్యాప్ రావడానికి ముఖ్య కారణమని జోరుగా వార్తలు వస్తున్నాయి.





Untitled Document
Advertisements