యుయుత్సుడు ఎవరి కుమారుడు?

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 12:31 PM

యుయుత్సుడు ఎవరి కుమారుడు?

ధృతరాష్ట్రునికి, రాజభవన పరిచారికకు జన్మించిన వాడు యుయుత్సుడు. ఇతడు కూడా దుర్యోధనుడు అతని సోదరులతో పాటు పెరిగి పెద్దవాడయ్యాడు. మాయాజూదం సమయంలో పాండవులకు జరిగిన అన్యాయానికి యుయుత్సుడు బాధపడ్డాడు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో సిగ్గుతో తలవంచుకున్నాడు. మహాభారత యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు యుయుత్సుడు పాండవుల పక్షాన చేరాడు. మహాభారత యుద్ధంలో చనిపోయిన వారు చనిపోగా మిగిలిన కొద్ది మంది లో ఇతను ఒకడు. యుద్ధానంతరం ధర్మరాజు యుయుత్సునికి  ఉన్నత స్థానం ఇచ్చి గౌరవించాడు.





Untitled Document
Advertisements