రక్తజుడు ఎవరి పూర్వజన్మ పుట్టుక !

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 12:32 PM

రక్తజుడు ఎవరి పూర్వజన్మ పుట్టుక !

అర్జునుని పూర్వ జన్మ లలోని పుట్టుక రక్తజుడు. శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తరగతి నుంచి వేయగా, అప్పుడు బ్రహ్మ నుదుటి నుండి ఆగ్రహం వల్ల చెమట ఉద్భవించగా దాని నుండి 1000 కవచనాలతో, విల్లమ్ములతో శ్వేదజుడు జన్మించి అతడు శివుని వెంటపడగా శివుడు తన కపాలముతో విష్ణువు వద్దకు పరిగెత్తాడు. విష్ణువు తన చేతిని ఆ కపాలంలో ఉంచగా అందులో నుండి రక్తం స్రవించింది. ఆ రక్తం నుండి రక్తజుడు జన్మించాడు. రక్తజుడు,శ్వేదజుడు ఇద్దరూ రెండేళ్లు యుద్ధం చేశారు. తర్వాత దేవతలు వారిని శాంతింప జేసి మీరు ద్వాపర కలియుగలలో జన్మించి, మీలో వీరెవరో తెలుసుకోమని చెప్పగా వారు యుద్ధాన్ని ఆపుతారు. శ్రీ మహావిష్ణువు నరుని గా జన్మించి రక్తజుడికి తన సహకారం అందిస్తానని అభయమిస్తాడు. ఆ నరుడే అర్జునుడు, శ్రీమహావిష్ణువు కృష్ణుడిగా, శ్వేదజుడు( సహస్రకవచుడు) కర్ణుడిగా జన్మిస్తారు.

Untitled Document
Advertisements