రాజులు ఎలా ఏర్పడ్డారు? వారి యొక్క బాధ్యతలు ఏమిటి?

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 12:33 PM

రాజులు ఎలా ఏర్పడ్డారు? వారి యొక్క బాధ్యతలు ఏమిటి?

రాజ్యాన్ని పరిపాలించిన రాజుల ప్రాముఖ్యతను అన్ని పురాణాలు పేర్కొన్నాయి. ప్రతి జీవజాలానికి దానికి సంబంధించిన అధికారులను రాజు అంటారు. మొదటి రాజు బ్రహ్మదేవుడు. ఆయన ప్రజాపతుల్ని సృష్టించిన తరువాత చంద్రుని నక్షత్రాలకు, వైద్యానికి రాజుని చేశాడు. వరుణుడిని నదులకు సముద్రాలకు,  విశ్రవానుడిని రాజులకు రాజును, దేవతలకు విష్ణువును, దక్షుడిని ప్రజాపతులకు, ప్రహ్లాదుడిని దానవులకు, వాసుకిని నాగులకు, గరుడుని పక్షులకు. ఈ విధంగా అన్ని జీవరాశులకు రాజులు ఏర్పడ్డారు. మానవజాతిలో రాజుగా క్షత్రియుని గాని, బ్రాహ్మణుని గాని, సర్వ సేనాపతిని చేయాలి. అతడు గౌరవ కుటుంబంలో జన్మించి అన్ని న్యాయ, ధర్మ శాస్త్రాలు తెలిసి ఉండాలి. సంభాషణా చతురుడిని దౌత్యవేత్తగా నియమించాలి. మంత్రులకు ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. రాజు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి గూఢచారుల తో మాట్లాడి పూజాదికాలు నిర్వహించుకొని కొలువుకు రావాలి.





Untitled Document
Advertisements