ఆడ పిల్లల భవిష్యత్ కోసం డబ్బులు దాచుకోవాలనుకునేవారికి శుభవార్త...ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:36 AM

ఆడ పిల్లల భవిష్యత్ కోసం డబ్బులు దాచుకోవాలనుకునేవారికి శుభవార్త...ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ పథకం కేవలం ఆడ పిల్లలకు మత్రమే వర్తిస్తుంది. ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఈ పథకంలో చేరొచ్చు.

అమ్మాయి ఉన్నత చదువులు, పెళ్లి వంటి అవసరాలకు ఈ డబ్బులను ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. పదేళ్లలోపు ఆడ పిల్లలను ఈ పథకంలో చేర్పించొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ అన్నింటిలోకెల్లా ఈ పథకంలోనే అధిక వడ్డీ రేటు పొందొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెడితే 7.6 శాతంవడ్డీ వస్తుంది. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. వెళ్లి చేరొచ్చు. ఈ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

ప్రతి నెలా ఎంత డబ్బులు కట్టుకుంటారనేది మీ ఇష్టం. నెలకు రూ.12500 కడితే (రోజుకు రూ.416 ఆదా చేస్తే సరిపోతుంది).. మీకు మెచ్యూరిటీ తర్వాత చేతికి దాదాపు రూ.65 లక్షల వరకు వస్తాయి. అదే నెలకు రూ.5 వేలు కడితే చేతికి రూ.25 లక్షలు లభిస్తాయి. 15 ఏళ్ల పాటు డబ్బులు చెల్లిస్తూ వెళ్లాలి. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత పూర్తి డబ్బులు తీసుకోవచ్చు. పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Untitled Document
Advertisements