వారిద్దరూ విడిపోతారని మూడేళ్ల క్రితమే చెప్పా: వేణు స్వామి

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:44 AM

వారిద్దరూ విడిపోతారని మూడేళ్ల క్రితమే చెప్పా: వేణు స్వామి

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ అన్ని వుడ్‌లలోనూ సమంత-చైతూల విడాకుల ఇష్యూ హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. సూటిగా సుత్తిలేకుండా చెప్పడానికి కూడా మ్యాటర్ లేదక్కడ.. ఎందుకంటే పెళ్లి-పెటాకులు అనేది వాళ్ల వ్యక్తిగత మ్యాటర్. దాంట్లో ఎవరూ వేలుపెట్టడానికి వేలు లేదు. కలిసి ఉంటే ఉంటారు.. నచ్చకపోతే విడిపోతారు అది వాళ్ల ఇష్టం కాబట్టి.. ఎవర్నీ తప్పుపట్టే పరిస్థితి లేదు. కాకపోతే వాళ్ల మధ్య విభేదాలు.. విడాకులు.. భరణం అదీ ఇదీ అంటూ పుకార్లు అయితే మస్త్‌గా వస్తున్నాయి. అయితే అటు సమంత కానీ.. ఇటు నాగ చైతన్య కానీ.. అక్కినేని ఫ్యామిలీ పెద్ద బాస్ నాగార్జున కానీ ఈ ఇష్యూపై స్పందించకపోవడంతో.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాసుకుంటున్నారు.

ఇదిలాఉంటే.. తాజాగా ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. సమంత, నాగచైతన్య మధ్య విభేదాలు విడాకుల ఇష్యూపై స్పందిస్తూ.. తాను మూడేళ్ల క్రితమే వీళ్ల జాతకం చెప్పానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగా చైతన్య, సమంత జాతకం నా దగ్గర ఉంది. మూడేళ్ల క్రితమే వీళ్ల గురించి నాగరాజు ఇంటర్వ్యూలో చెప్పాను. వీళ్ల మ్యాటర్ నేను చెప్పినట్టుగా సీరియస్‌గానే ఉంది అని చెప్పారు.. ఇంతకీ సమంత నాగచైతన్య నిజంగానే విడిపోతున్నారా? అంటే గతంలో తాను ఏం చెప్పానో ఆ వీడియో చూడండని అంటున్నారు వేణు స్వామి.

ఇంతకీ నాలుగేళ్ల క్రితం (అప్పటికి సమంత నాగచైతన్యలకు పెళ్లి కాలేదు.. రిలేషన్‌లో ఉన్నారు) ఈ వేణు స్వామి.. సమంత-నాగ చైతన్యల గురించి ఏం చెప్పాడంటే.. ‘నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే కోపం ఏం లేదు.. గతంలో అక్కినేని అఖిల్‌‌కి ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. ఆ టైంలో అది చాలా వెబ్ సైట్స్‌లలో రావడంతో నాగార్జున మీ మీది కేసు వేస్తారట అదీ ఇదీ అన్నారు.. కానీ కొన్నాళ్లకు నేను చెప్పినట్టుగానే అఖిల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. నేను జాతకాలను విశ్లేషించి ఏం జరుగుతుందో చెప్తాను.. అఖిల్ గురించి కూడా అలాగే చెప్పాను. మ్యారేజ్ జరగదు.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాను అలాగే అయ్యింది. టైం లేకపోయినా నేను జాతకం చెప్పగలను.

అలాగే నాగచైతన్య-సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. ఎలాంటి సమస్యలు అంటే వాళ్లిద్దరి మధ్య గ్యాప్ రావచ్చు.. విడిపోవచ్చు.. సంతానం కలగకపోవచ్చు.. పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయి. సమంత అమావాస్య నాడు పుట్టింది.. దాని వల్ల చైతూకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది విశ్లేషించి చెప్పాను. సినిమాల పరంగా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. బాగా రాణిస్తారు.. పెళ్లి చేసుకున్నా సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుంది’ అని వేణు స్వామి.. సమంత-నాగ చైతన్యల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో పెళ్లికి ముందే అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు సమంత-చైతూ విడిపోతున్నారనే రూమర్లు రావడంతో ‘నేను చెప్పానుగా’ అంటూ సీన్‌లోకి వచ్చి వైరల్ అవుతున్నాడు వేణు స్వామి.

Untitled Document
Advertisements