ఒంటి దురదలు మిమల్ని వేధిస్తున్నాయా? అయితే ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 01:47 PM

ఒంటి దురదలు మిమల్ని వేధిస్తున్నాయా? అయితే ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి

ఒక్కోసారి మనం ఎన్ని రకాల సబ్బులు మార్చిన, లోషన్లు వాడిన, డాక్టర్ను కలిసి వారిచ్చిన మందులు వాడినా కూడా ఒంటి దురదలు అనేవి తగ్గవు. ఒంటి దురద వల్ల మనం పని మీద సరైన శ్రద్ధ పెట్టలేము. ఏ పని చేస్తున్నా సరే మన ధ్యాసంతా దురదలు పైనే ఉంటుంది. అయితే ఇలాంటి దురదలను మనం ఇంట్లోనే ఆయుర్వేదంలోని చిట్కాలతో దూరం చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శరీరం మీద దురద ఉన్నప్పుడు మిరియాలను వేపాకును కలిపి బాగా నూరి తింటే దురద తగ్గిపోతుంది.
కొబ్బరి నూనెలో వేపాకు రసం వేసి, దాన్ని బాగా మరిగించి దురద ఉన్నచోట రాస్తూ ఉంటే దురద తగ్గిపోతుంది.
వేప చిగుళ్లు, పసుపు ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి శరీరానికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే దురదలు నయమవుతాయి.
ఆవు నూనె ఐదు తులాలు, అమృతధార 20 చుక్కలు ఈ రెండింటినీ కలిపి శరీరంపైన మర్దన చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి.
ఆవుపేడను ఒంటికి పట్టించుకొని, బాగా మర్దించి గంట ఆగిన తర్వాత వేడినీటితో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి.
వేప చిగుళ్లు, పసుపు ఈ రెండింటినీ ముద్దగా నూరి శరీరానికి పట్టించి ఓ అరగంట తర్వాత వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి.

Untitled Document
Advertisements