ధరించే చీరను బట్టి ఆత్మవిశ్వాసం!

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 01:49 PM

ధరించే చీరను బట్టి ఆత్మవిశ్వాసం!

స్త్రీలు ధరించే చీరను బట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఫంక్షన్ అంటే చాలా ఎలాంటి చీర ధరించాలని తెగ కసరత్తు చేస్తారు. చీర కు సంబంధించిన లోదుస్తులను చీర పై వేసుకునే నగల వరకు మ్యాచ్ లను ఎంపిక చేసుకుంటారు. చీర స్త్రీల లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే వారు సందర్భాన్నిబట్టి ఎంచుకుంటారు.
చీర ఎంపిక ఒక ఎత్తయితే చీర కట్టు మరో ఎత్తు. చీరకట్టు లో జాగ్రత్తలు పాటించకపోతే పది మందిలో పది రకాల కామెంట్లు వినబడతాయి. చీరను కొందరో నాభి కింద కట్టుకుంటారు నిజానికి ఇది సరైన పద్ధతే.
అలాగే కొందరు చీర కొంగుతో నడుము భాగాన్ని పూర్తిగా కప్పి వేసుకుంటారు. చీరకట్టులో నడుముకు కూడా ప్రాధాన్యత ఉంది. ఆత్మ విశ్వాసం గల స్త్రీలు ఇలాంటి వాటిపై వచ్చే కామెంట్స్ ని పట్టించుకోరు. స్త్రీలు ధరించే చీర పరపతిని తెలియజేస్తుంది.
అలాగని తాహకుమించి చీరలును ఖరీదు చేయడం ఆర్థికపరమయిన తప్పు. ఇది స్త్రీలు గుర్తించగలిగితే వారికున్న చీరలను సరైన పద్ధతిలో వారు వాష్ చేసుకోవడం, ఐరన్ చేసుకోవడం చేస్తారు. పదిలంగా వాటిని ధరిస్తూ ఉంటారు.
హిందూ సాంప్రదాయం లో స్త్రీలు ధరించే చీరకట్టు ముందు ఏ వస్త్రధారనైనా దిగదుడుపేనన్న సత్యాన్ని పాశ్చాత్యులే గుర్తించారు.
యుక్త వయసు వచ్చిన నాటి నుండి వృద్ధాప్యం వరకు చీరకట్టులోనే స్త్రీ అపురూపంగా అందంగా సౌమ్యంగా కనిపిస్తుందనేది అక్షరసత్యం.

Untitled Document
Advertisements