పొడిదగ్గు తగ్గించుకోండిలా!

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 01:51 PM

పొడిదగ్గు తగ్గించుకోండిలా!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కాస్త తగ్గినా సరే చుట్టూ ఉన్న వాళ్ళు విచిత్ర జీవిని చూస్తున్నట్టుగా చూస్తారు. కారణం కరోనా మహమ్మారి. ఈ మహమ్మారి వ్యాపించింది అని చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది దగ్గు. ఇది అన్ని దగ్గులు కరోనా కి సంబంధించినది కాదు. సాధారణ దగ్గు అయినా కూడా అందరూ విచిత్రంగా చూడడం మామూలైపోయింది నేటి రోజుల్లో. ఇటువంటి సాధారణ దగ్గు ఎన్ని మాత్రలు వాడిన, మిరపలో తాగినా తగ్గడం లేదు. అటువంటి మొండి దగ్గు కి ఆయుర్వేదం లోని కొన్ని చిట్కాలు మీకోసం.
* అరటిపండులో మిరియాల చూర్ణం వేసి తినడం వలన దగ్గు తగ్గుతాయి.
* లవంగాలను కాల్చి పొడిచేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* పిప్పళ్ళ చూర్ణమును తేనెలో గాని, తిప్పతీగ కషాయం లో గానీ, నేలవేము కషాయం లోగానే కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* నిప్పుల మీద వామును వేసి పొగను పీల్చడం వలన కూడా దగ్గు తగ్గుతుంది.
* పసుపు కొమ్ములను వేయించి, చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఒకటి రెండు ముక్కలను బుగ్గ నందు పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే దగ్గు తగ్గిపోతుంది.
మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి  ఈ మూడింటినీ సమ భాగాలుగా తీసుకుని, పొడి చేసి పెట్టుకొని, ఈ రోజు కాస్త పొడి తీసుకుని ఆ పొడికి కాస్త బెల్లాన్ని చేర్చి ప్రతిరోజూ మూడు పూటలా తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గిపోతుంది.
* పచ్చి పసుపు, శొంఠి, నల్ల కరక్కాయలు, వాము, పిప్పళ్ళు, నల్ల ఉప్పు ఈ వస్తువులు అన్నింటిని సమభాగాలుగా కలిపి అంతగా నూరాలి. ఈ చూర్ణాన్ని
ఉదయము సాయంత్రము అర్ధ తులం చూర్ణము చొప్పున వేడి నీటిలో కలుపుకుని తాగుతూ ఉంటే 1, 2 వారాల లో అన్ని రకాలైన దగ్గులు తగ్గిపోతాయి.
* తులసి పువ్వులను అల్లపురసంతో నూరి శనగ గింజలంత మాత్రలుగా చేసి పూటకు ఒక మాత్ర చొప్పున మంచి నీటితో తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గిపోతుంది.
* తేనెతో మిరియాల పొడిని మరియు తులసి ఆకుల రసం కలిపి తింటే దగ్గు కఫము తగ్గిపోతాయి.
* నల్ల తులసి ఆకు రసంలో తేనెను కలిపి, పిల్లలతో తాగించిన ఎడల పిల్లల వగర్పు, దగ్గులు నయమవుతాయి.
* లవంగాలను కాల్చి పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
* అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* లవంగాల చూర్ణం లో కొద్దిగా ఉప్పును కలిపి చప్పరిస్తూ ఉంటే పొడిదగ్గు తగ్గుతుంది.





Untitled Document
Advertisements