ఒంటి దుర్వాసన మిమల్ని వేధిస్తోందా? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 01:52 PM

ఒంటి దుర్వాసన మిమల్ని వేధిస్తోందా? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే

కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా ఈ సార్లు స్నానం చేసినా సరే ఒంటి నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్లు రకరకాల సబ్బులు మార్చినా, క్రీములు వాడినా, కొత్త కొత్త డియోడరెంట్లు పర్ఫ్యూమ్లు వాడిన ఒంటి దుర్వాసన నుండి పట్టించుకోలేరు. అయితే ఇటువంటి వారికోసం ఆయుర్వేదంలో కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. వాటిని గనక మీరు అనుసరించి నట్లయితే ఒంటి దుర్గంధం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూసేద్దామా..
* కరక్కాయ పెచ్చులు, వేపాకు, లోదుగపట్ట, దానిమ్మపట్ట, ఏడాకుల అరటి చెట్టుపట్ట వీటిని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఇంటికి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే దుర్గంధం పోయి, శరీరం సువాసనలు వెదజల్లుతుంది.
* నువ్వులు, ఆవాలు, పసుపు, మెంతులు ఈ వస్తువులను సమంగా కలిపి నూరి శరీరానికి నలుగు పెట్టుకుంటే దుర్వాసన తగ్గిపోతుంది.
* వేపాకుల రసం చంకలలో రాస్తూ ఉంటే చంకలలో వచ్చే చెమట దుర్వాసన తగ్గిపోతాయి.
* పసుపు కొమ్ములను వేయించి పొడిచేసి ఆ పొడిని ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే శరీర దుర్గంధం నశిస్తుంది.





Untitled Document
Advertisements