ఇలా చేస్తే చిటికెలో నిద్ర పోతారు!

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 01:57 PM

కొంతమందికి పగలంతా కష్టపడి పని చేసినప్పటికీ రాత్రుల్లో అంత త్వరగా నిద్ర పట్టదు. నిద్ర రావట్లేదు కదా అని చెప్పి టీవీ చూస్తు, ఫోన్ లో గేమ్ ఆడుతూ, కంప్యూటర్లముందు కూర్చుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఆ గంటల తరబడి రకరకాల గ్యాడ్జెట్స్ ముందు కూర్చుని వేళకాని వేళలో పేరుతో జంక్ ఫుడ్ తింటే రోగాల బారిన పడుతూ ఉంటారు. జరగడానికి గల ముఖ్య కారణం అయినా సమయంలో నిద్ర మీదరికి చేరకపోవడం. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో నిద్ర పోవచ్చు.
* ప్రతిరోజు ఉదయం పూట, సాయంత్రం పూట ఒక నిమ్మకాయలోని రసమును అలవాటు చేసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.
* ఒక కప్పు వేడి పాలలో రెండు స్పూన్ల నువ్వుల నూనెను వేసి కొనే ముందు తాగితే హాయిగా నిద్ర పడుతుంది.
* టబ్లో గోరువెచ్చనినీటిని పోసి పాదాలను శుభ్రంగా కడుక్కొని, ఆ నీటిలో పాదాలను 15 నిమిషాల వరకు నుంచి పాదాలను బయటకు తీసి కొద్దిగా కొబ్బరినూనెతో పాదాలు మర్దిస్తే హాయిగా నిద్ర పడుతుంది.
* వేడి చేసిన గసగసాలు గుడ్డలో మూటకట్టి వాసన చూస్తే నిద్ర త్వరగా పడుతుంది.
* కురసాని వాము నిప్పుల మీద వేసి ఆ పొగను ఇస్తే నిద్రపట్టని వారికి సైతం గాఢ నిద్ర వచ్చును.
* పడుకునేటప్పుడు ఒక కప్పు వేడి పాలలో కొంచెం తేనె కలిపి తాగితే హాయిగా నిద్ర పడుతుంది.

Untitled Document
Advertisements