భూతా నాయకుడిగా రుద్రున్నే ఎందుకు ఎంచుకున్నారు!

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 02:00 PM

భూతా నాయకుడిగా రుద్రున్నే ఎందుకు ఎంచుకున్నారు!

క్రింది తేగల వారు రుద్రుడు సృష్టించిన జీవులు. వీరిని నాలుగు చిన్న తెగలుగాపురాణాలు విభజించాయి. అది ధర్మ ప్రజా, ఈశ్వర ప్రజా, కాశ్యపేయ ప్రజా, పులహ పూజ. వీరి సంతతికి ఆద్యుడు పులహుడు. బ్రహ్మదేవుడు రుద్రున్ని సృష్టి చేయమని కోరగా ఇతను తన భార్య సతివల్ల వేల భూతాలకు జన్మనిచ్చాడు. వారంతా రుద్రుని పోలికలే. సన్నని కాళ్లు చేతులు పొడవైన చెవులు, బండ గా ఉండి వేలాడే పెదాలు, ఎర్రని కళ్ళు, పెద్ద కనుబొమ్మలు, కరుకుగా పొడవైన పళ్ళు,పొడవైన గోళ్ళు, మురికి పట్టిన జుట్టు, వీరంతా నగ్నంగా చేతిలో పుర్రెతో శివుని కొలువులో ఉండేవారు. వీరి ఆయుధం త్రిశూలం,విల్లు,ఖడ్గం. రుద్రుడే వీరికి నాయకుడు. అందుకే ఇతన్ని భూత నాయకుడని, గణనాయకుడని అంటారు . భూతాలను పాలించిన ఎవరైనా రుద్రుడు అనే పిలుస్తారు. వరుణ పురాణం ప్రకారం 11 కోట్ల భూతాలున్నాయి. శివునికి అంధకాసురుని కి మధ్య జరిగిన యుద్ధంలో శివుని పక్షాన పోరాడాయి. వీరు దేవతల లో కలిసి అసురుల తో చాలాసార్లు పోరాడారు. వీరు ఎన్నోసార్లు దేవతలతో అసురులతోను కలిసి యుద్ధాలు చేశారు. ఉత్తర భారత దేశాన్ని వదిలి దక్షిణ భారతదేశం వచ్చారు.
వైవశ్వ మన్వంతర సమయానికి వీరు దక్షిణాది వారయ్యారు.





Untitled Document
Advertisements