పవన్ కు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ...తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే మా మద్దతు అంటూ లేఖ

     Written by : smtv Desk | Mon, Sep 27, 2021, 12:58 PM

పవన్ కు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ...తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే మా మద్దతు అంటూ లేఖ

త‌న సినిమాల‌ను దెబ్బ తీయాల‌నే ఉద్దేశంతో సినీ ప‌రిశ్ర‌మ‌ను వై.ఎస్‌.జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇబ్బంది పెడుతుందంటూ శ‌నివారం సాయంత్రం జ‌రిగిన రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జ‌స‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ మాట‌ల‌కు వైసీపీ నాయ‌కులు కూడా కౌంట‌ర్స్ ఇచ్చారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు నాని, కార్తికేయ వంటి స్టార్స్ మ‌ద్ద‌తుని తెలిపారు. పార్టీల ప‌రంగా కాకుండా, ప‌రిశ్ర‌మ ప‌రంగా ఆయ‌న మాట్లాడిన తీరుని వారు స‌మ‌ర్ధించారు. ఈ నేప‌థ్యంలో ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎలా రియాక్ట్ అవుతుందోన‌ని అంద‌రూ ఎదురుచూశారు.

ఎట్ట‌కేల‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. వేదికలపై వ్యక్తుల వ్యక్తం చేస్తున్న భావాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని, ఇది వరకే ప్ర‌భుత్వంతో తాము చ‌ర్చించామ‌ని వారు సానుకూలంగానే స్పందించార‌ని, క‌రోనా వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ దెబ్బ‌తింద‌ని, దీంతో రెండు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు త‌మ‌కు అండ‌గా నిల‌వాల‌ని వారు కోరారు. ఇంత‌కీ లేఖ‌లో ఛాంబ‌ర్ ఏమ‌ని పేర్కొందంటే...‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు.

మన తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కారణంగా ఇతర సమస్యల రాష్ట్ర విభజన తాకిడికి గురైన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితి కారణంగా, మా పరిశ్రమ అత్యంత దయనీయ మైన పరిస్థితిలో ఉంది. వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను మరియు ఆవేదనను వివిధ వేదికలపై వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ యొక్క అభిప్రాయం కాదు. మా పరిశ్రమ యొక్క అపెక్స్ బాడీ రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పునరుద్ఘాటించాలనుకుంటున్నాము. సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించలేము.

ఈ పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది ప్రజలు మరియు వారి కుటుంబాలు మార్చి 2020 నుండి బాధపడుతున్నారు. ఈ తరుణంలో మన నాయకులు మరియు ప్రభుత్వాలు పెద్ద మనసుతో వారి నిరంతర మద్దతును అందించడానికి చిత్ర పరిశ్రమకు మద్దతు అవసరం. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మన చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు మరియు మా గౌరవనీయ ముఖ్యమంత్రులు ఇద్దరూ చురుగ్గా ఉన్నారు మరియు వారి ప్రోత్సాహం మరియు మద్దతు ఎల్లప్పుడూ మాకు అందించారు. వారి నిరంతర దీవెనలు మరియు మద్దతు కోరుతున్నాం’’ అని తెలిపారు.





Untitled Document
Advertisements